దొంగ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ టైం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు. గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన ప్రపంచంలోనే మొట్ట మొదటి దొంగగా మరో రికార్డు సృష్టించాడు. సాధారణంగా అయితే మనుషులు సాధించిన అద్భుత విజయాలను, ప్రకృతి వైపరీత్యాలను ఈ బుక్ రికార్డుల్లో ఎక్కిస్తారు. అయితే ఈ దొంగ ఎందుకు గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కారు. అతను చేసిన సాహసం ఏంటో తెలుసుకుందాం..
స్టీఫెన్ బ్లంబెర్గ్ అనే అమెరికాకు చెందిన ఓ పుస్తకాల దొంగ..ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పుస్తకాలను దొంగిలించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు బ్లంబెర్గ్. 1970ల నుంచి 1990ల మధ్య ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఉన్న 268 లైబ్రరీలనుంచి, మొత్తం దాదాపు 19 టన్నుల బరువున్న 23వేల600 అరుదైన పుస్తకాలను దొంగిలించాడు. ఏళ్ల తరబడి పుస్తకాలు దొంగిలిస్తున్నా ఎవరి కంటా పడలేదు. అయితే మాజీ స్నేహితుడు కెన్నెత్ రోడ్స్ అనే వ్యక్తి అధికారులకు సమాచారంతోదశాబ్దాల పాటు సాగిన అతని ఈ దొంగతనాల పరంపరకు తెరపడింది.
1991 జూలైలో బ్లంబెర్డ్ దొంగతనాలకు చెక్ పడింది. పుస్తకాలను దొంగిలించడం, రవాణా చేయడం వంటి ఆరోపణలతో బ్లంబెర్గ్ దోషిగా నిర్దారించారు. ఇది సాహిత్య చరిత్రలోనే అత్యంత అసాధారణమైన క్రైం స్టోరీలలో ఒకటి మిగిలింది.
15 ఏళ్ల వయసులో స్కిజాయిడ్ పర్సనాలిటి డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్న బ్లంబర్గ్..అరుదైన పుస్తకాలు, చారిత్రక కళా ఖండాల విలువను గుర్తించడంతో లైబ్రరీలు విఫలమయ్యాయని నమ్మేవాడు. పుస్తకాలు దొంగిలించడం అంటే తన దృష్టిలో వాటిని కాపాడుతున్నాడని అర్థం. చాలావరకు సంచార జీవితం గడిపిన బ్లంబెర్గ్.. ఒకేసారి నెలల తరబడి దేశమంతటా పర్యటించేవాడు. అతను తన కోసం పుస్తకాలను దొంగిలించేవాడు. స్తోమత ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ పుస్తకాలు కొనలేదు, బదులుగా దోపిడీలలో తన సమయాన్ని, శ్రమను వెచ్చించేందుకు ఇష్టపడేవాడు.
పొట్టిగా సన్నగా ఉన్న బ్లంబర్గ్.. ఇరుకైనప్రదేశాల్లో కూడా ఈజీగా చొరబడేవాడు. చాలా సంవత్సరాలపాటు అతని నేరాలు గుర్తించలేకపోయారు. స్టీఫెన్ హంట్స్‌బెర్రీ అనే వాషింగ్టన్ యూనివర్సిటీలో క్యాంపస్ పోలీస్ అధికారికి ఈ సీరియల్ పుస్తకాల దొంగపై అనుమానం కలిగింది.అయితే ఇతనికి బ్లంబర్గ్ స్నేహితుడు రోడ్సే ఇచ్చిన సమాచారంతో FBI అధికారులకు పట్టుబడ్డాడు.
