హైదరాబాద్: ఐపీఎల్ 19లో భాగంగా ఆదివారం (మే 3) సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్ స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. గాయం కారణంగా నితీష్ ఈ మ్యాచ్ ఆడటం లేదని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. నితీష్ స్థానంలో స్మరణ్ రవిచంద్రన్ జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.
బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న నితీష్ కుమార్ రెడ్డి దూరం కావడం ఎస్ఆర్హెచ్కు ఎదురుదెబ్బే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికైతే నితీష్ గాయంపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే, గాయం అంతా తీవ్రమైనది కాదని.. నెక్ట్స్ మ్యాచ్‌కు నితీష్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందంటున్నాయి ఎస్ఆర్హెచ్ వర్గాలు.
ఇక, టోర్నీలో వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్ కేకేఆర్‌పై విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బరిలో దిగుతోంది. ఈ సీజన్లో 9 మ్యాచులాడి 6 మ్యాచులు గెలిచి పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్‌లో ఉంది సన్ రైజర్స్. ఈ సీజన్లో ఇప్పటికే కేకేఆర్‌పై ఒకసారి విజయం సాధించింది సన్ రైజర్స్.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్, క్లాసెన్, సలీల్ అరోరా లాంటి హార్డ్ హిట్టర్స్ తో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్. ప్యాట్ కమ్మిన్స్ ఎంట్రీతో పాటు యువ బౌలర్లు కూడా రాణిస్తుండటంతో సన్ రైజర్స్ బౌలింగ్ యూనిట్ పుంజుకుంది.
ఇక, ఈ సీజన్లో 8 మ్యాచులాడి కేవలం రెండు మ్యాచులు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 8వ ప్లేస్‌లో ఉంది కేకేఆర్. టాప్ ఆర్డర్ వరుసగా ఫెయిల్ అవుతుండటంతో భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతోంది కేకేఆర్. రింకు సింగ్ మినహా మిడిల్ ఆర్డర్ కూడా ఆకట్టుకోలేకపోతుండటంతో ఇబ్బందులు పడుతోంది కేకేఆర్.
లీగ్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్ కేకేఆర్‌ను చిత్తు చేసి ఫ్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైఫు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కేకేఆర్ ఈ మ్యాచులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది.
జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్య రహానే(సి), అంగ్క్రిష్ రఘువంశీ(w), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(సి), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ
