బీసీ కులవృత్తుల అభివృద్ధిపై కమిషన్ రివ్యూ..10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

బీసీ కులవృత్తుల అభివృద్ధిపై కమిషన్ రివ్యూ..10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సాంప్రదాయ కులవృత్తులకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించడంపై బీసీ కమిషన్ దృష్టి పెట్టింది. ఈ అంశాలపై బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు ఖైరతాబాద్‌‌‌‌లోని కమిషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సాంప్రదాయ కులవృత్తులను ఆధునీకరించడం, వాటి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, వృత్తిదారులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

ఇతర రాష్ట్రాల్లో కులవృత్తుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న విధానాలను అధికారులు కమిషన్‌‌‌‌కు వివరించారు. వివిధ కులవృత్తుల అభివృద్ధికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి, అధికారులు అలోక్ కుమార్, మల్లయ్య భట్టులను కమిషన్​చైర్మన్ ఆదేశించారు. కులవృత్తుల్లో అనుసరిస్తున్న మెరుగైన విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో, అవసరమైతే విదేశాల్లోనూ పర్యటించి అధ్యయనం చేయనున్నట్లు చైర్మన్​తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు, సంస్థలతో చర్చించడంతో పాటు కుల సంఘాల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకోవాలని పేర్కొన్నారు.