హైదరాబాద్, వెలుగు: ఎల్ నినోపై కేటీఆర్, హరీశ్ రావు నీచ రాజకీయాలు చేయడం దురదృష్టకరమని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్ష నేతలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి.. దిగజారుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విపత్తు నుంచి తెలంగాణను కాపాడేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ప్రజలకు, రైతులకు పూర్తి మనో ధైర్యం కల్పిస్తున్నారని చెప్పారు.
