ఇబ్రహీంపట్నం, వెలుగు : గంజాయి స్మగ్లర్లు తెలివిమీరిపోయారు. ఎవరూ ఊహించని విధంగా ఫుడ్ డెలివరీ బ్యాగుల్లో గంజాయి తరలిస్తూ అమ్ముతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మూసారాంబాగ్ లో ఉండే గద్వాల జిల్లాకు చెందిన గొడ్మూరు సుకేష్ బాబు (28) స్టూడెంట్ కాగా, దిల్‌సుఖ్‌నగర్ లో ఉండే గద్వాల జిల్లా రాజోలి మండలం మందొడ్డికి చెందిన గంటపోగు రవి (29) స్విగ్గీ డెలివరీ బాయ్ . ఇద్దరూ ఇంతకుముందు గాంజా తీసుకునేవారు.
తర్వాత పెడ్లర్లుగా అవతారం ఎత్తారు. వీరిద్దరూ ఏపీలోని అరకుకు చెందిన ప్రదీప్ నుంచి గంజాయి కొని మంచాల పరిధిలోని కస్టమర్లకు సప్తై చేస్తున్నారు. మామూలుగా అయితే, దొరికిపోతామని, డెలివరీ బ్యాగ్‌లో బరువు తూచే డిజిటల్మెషీన్, చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయిని తీసుకువెళ్లి అమ్ముతున్నారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి చౌరస్తాలో శుక్రవారం అమ్ముతుండగా మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి 1.1 కిలోల పొడి గంజాయి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని సీఐ మధు తెలిపారు.
