హైదరాబాద్ : ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల పర్యావరణ పరిరక్షకుడనే పేరుతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఫేక్ డాక్టరేట్ పొందాడని బీజేపీ కార్పొరేటర్లు వంగా మధుసూదన్‌రెడ్డి, కొప్పుల నరసింహా రెడ్డి ఆరోపించారు. తప్పడు డాక్టరేట్‌తో ప్రజలను ఎమ్మెల్యే మభ్య పెడుతున్నారని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీపైనా ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నకిలీ డాక్టరేట్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ మార్గంలో ఎమ్మెల్యే వేల కోట్లు డబ్బు సంపాదించారని, దీనిపైనా విచారణ జరిపించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
