శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ ప్రతాప్ శుక్లా : మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ ప్రతాప్ శుక్లా : మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి

తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.బుధవారం ( ఏప్రిల్ 1 ) సతీసమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు వేదం ఆశీర్వచనాలు అందించగా..తీర్థ ప్రసాదాలు అందజేశారు టీటీడీ అధికారులు. 

ఈ క్రమంలో గవర్నర్ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. గవర్నర్ శుక్లాను శాలువాతో సత్కరించారు వెంకయ్య చౌదరి.

►ALSO READ | పల్నాడు ఎస్పీ ఆఫీసు దగ్గర హైడ్రామా... ఏడు గంటల పాటు ఆఫీసులోనే బైఠాయించిన ఎమ్మెల్యే 

తెలంగాణ గవర్నర్ గా మార్చి 11న ప్రమాణ స్వీకారం చేశారు శివ్ ప్రతాప్ శుక్లా. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న శుక్లాను ఇటీవలే తెలంగాణ గవర్నర్ గా నియమించింది కేంద్రం. తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ శర్మను మహారాష్ట్ర గవర్నర్ గా నియమించింది కేంద్రం.