పదేండ్లలో మీరు చేయలేనిది..పది నెలల్లోపే మేం చేసినం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

పదేండ్లలో మీరు చేయలేనిది..పది నెలల్లోపే మేం చేసినం :  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
  • గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్​పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • నాడు విద్యార్థులను గోసపెట్టి, ఇప్పుడు హరీశ్‌ రావు చిలుక పలుకులు పలుకుతున్నరు
  • స్టూడెంట్ల సమస్యలపై చర్చకు రెడీగా ఉండాలని సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది.. తాము పది నెలలు కాకముందే చేసి చూపించామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవో 55ను రద్దు దేండ్లచేశామని, 11 వేల డీఎస్సీ పోస్టులు ఇచ్చామని చెప్పారు. జీవో నంబర్ 3 తీసుకొచ్చి హారిజాంటల్ సమస్యను కూడా పరిష్కరించామన్నారు. రాష్ట్రంలో గత పలో మీరు సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ విద్యార్థులకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. మామ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బామ్మర్ది కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావుకు ఉన్న పంచాయితీలను, కోపాన్ని ప్రభుత్వంపై చూపడం ఏంటని ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. ‘‘విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకుందామంటే ఈ పదేండ్లలో హరీశ్ రావు అందుబాటులో లేడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెట్టించిన హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడొచ్చి చిలుక పలుకులు పలుతున్నారు. గత సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలకు గానీ, విద్యార్థులకు గానీ చేసిన అభివృద్ధి, సంక్షేమంపై కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్చకు సిద్ధమా..? ఎక్కడైనా అయినా విద్యార్థుల సాక్షిగా చర్చకు నేను రెడీ”అని సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవినీతిని బయటకు తీస్తాం..

సీఎం రిలీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు పెషీలో పని చేసిన ఒక వ్యక్తి ఇదే స్కాంలో అరెస్టయిన విషయాన్ని గుర్తుచేశారు. సమస్యలను చెప్పుకోవడానికి తమ ప్రభుత్వం అవకాశం ఇస్తుందని, మీలాగా తాము గొంతులు నొక్కడం లేదన్నారు. మీ ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు పడ్డాయో అందరికీ తెలుసని, తమ ప్రభుత్వ పాలనలో ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ స్కూళ్లను బంద్ చేస్తే.. తాము పేద ప్రజల కోసం స్కూళ్లను తెరిపిస్తున్నామని చెప్పారు. ఇక్కడ పేపర్ లీకేజీ చూసి.. అక్కడ పెద్దలు నీట్ పేపర్ లీకేజీ చేశారని ఆరోపించారు. సమస్యలు ఉంటే తనతో చెప్పాలని సీఎం దగ్గరికి స్వయంగా తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావుకు సూచించారు.