హైదరాబాద్, వెలుగు : మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సెగ్మెంట్లో బీజేపీ తరఫున టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏ.వెంకటనారాయణ్ రెడ్డి (ఏవీఎన్ రెడ్డి) పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు. మార్చ్ లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏవీఎన్రెడ్డితో పాటు మురళీమనోహర్ పేర్లను కేంద్రానికి పంపగా.. ఏవీఎన్‌రెడ్డి పేరును ఢిల్లీ నేతలు ఖరారు చేశారు. హైదరాబాద్ కి చెందిన ఏవీఎన్‌రెడ్డి.. ప్రస్తుతం దిల్ సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్, ఏవీఎన్ఇంజినీరింగ్ కాలేజీ, ఏవీఎన్ ఇంటర్నేషన్ స్కూల్ తదితర విద్యాసంస్థలకు చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
