వికారాబాద్, వెలుగు : అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో బీఆర్ ఎస్ మాజీ సర్పంచ్ లు, కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ లో చేరారు. వికారాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నేత మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నారాయణపూర్ మాజీ సర్పంచ్ సుభాన్ రెడ్డి, కోటాలగూడ మాజీ సర్పంచ్ రాములు నాయక్, ప్యాక్స్ డైరెక్టర్ చెన్నయ్య, గ్రామ అధ్యక్షుడు మల్లేశం, వార్డు మెంబర్ మల్లేశం, కార్యకర్తలు వెంకట్ రెడ్డి, రాములు, నర్సింలు, శ్రీనివాస్,జంగయ్య ప్రవీణ్ కుమార్, అనిల్, అరుణ్,శామల్, ప్రసన్నకుమార్, మధు,శ్రీశైలం,భాను తదితరులు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరగా వారికి స్పీకర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
