అక్రమ హోర్డింగులపై కఠిన చర్యలు : ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి 

అక్రమ హోర్డింగులపై కఠిన చర్యలు : ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎంఎంసీ పరిధిలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్​లు, ఫ్లెక్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. శనివారం బోడుప్పల్​లోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు. ట్రేడ్ లైసెన్స్ లేని దుకాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేశవ్ నగర్, బృందావన్ కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేసిన ప్లాట్ యజమానులను గుర్తించి వెంటనే ఆ స్థలాలను శుభ్రం చేయించాలన్నారు.

అలాగే విద్యుత్ స్తంభాలు, గోడలపై ఉన్న ప్రకటన బోర్డులను తక్షణమే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. వీటితో పాటు బోడుప్పల్ పీహెచ్​సీలోని పార్క్, ఓపెన్ జిమ్ పరికరాలకు రిపేర్లు చేయించాలని, అర్బన్ పార్క్ పనులను స్పీడప్ చేస్తూ అండర్​గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. చివరగా హనుమాన్ నగర్​లో జరుగుతున్న సెన్సస్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను సైతం వదిలిపెట్టకుండా, మరోసారి వెళ్లి పక్కాగా డేటా సేకరించాలని ఎన్యుమరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట డీసీ శైలజ, ఈఈ రమేశ్ బాబు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు.