V6 News

కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం

కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం

డెహ్రాడూన్: కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ ఆలయం బుధవారం తెరుచుకోనుండటంతో భక్తులకు ఆలయ కమిటీ కీలక సూచన చేసింది. దేవాలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. గుడి లోపల ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడంపై పూర్తి నిషేధం విధించింది. ఈమేరకు మంగళవారం ఆలయ కమిటీ సభ్యుడు వినీత్ పోస్తి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ పవిత్రతను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నిబంధనలను అతిక్రమించి ఫోన్లను లోపలికి తీసుకెళ్లినా, రహస్యంగా చిత్రీకరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.