న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై ఈసీకి ఫిర్యాదు అందింది. ఈ నెల 18న దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఉల్లంఘించేలా ఉందని సుమారు 700 మందికి పైగా పౌరులు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కు లేఖ రాశారు. వీరిలో మాజీ సివిల్ సర్వెంట్లు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు ఉన్నారు. దూరదర్శన్, సంసద్ టీవీ, ఆల్ ఇండియా రేడియోలాంటి ప్రభుత్వ అధికారిక వేదికల ద్వారా మోదీ చేసిన ప్రసంగం.. కేవలం రాజకీయ ప్రచారం కోసమేనని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో నడిచే మీడియాను ఉపయోగించుకోవడం వల్ల అధికార పార్టీకి అదనపు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

