న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, తక్కువ ధరలో ఎక్కువ డేటా కోరుకునే వినియోగదారుల కోసం రూ.225 ధరతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. రోజుకు 2.5జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది.
ఒకవేళ రోజువారీ కోటా ముగిస్తే, ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ కాలపరిమితి 30 రోజులు. ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోలిస్తే, ఈ ధరలో బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్కువ డేటాను అందిస్తోంది.
