అంతుబట్టని కారణం.. బోట్స్వానా‌లో 360 ఏనుగులు మృతి

అంతుబట్టని కారణం.. బోట్స్వానా‌లో 360 ఏనుగులు మృతి
  • నీరసించిపోయిన మిగతా ఏనుగులు
  • కారణాలు తెలియాల్సి ఉందన్న డాక్టర్లు

బోట్స్వానా(సౌత్‌ఆఫ్రికా): సౌత్‌ఆఫ్రికాలోని బోట్స్వానాలో మూడు నెలల్లో 360 ఏనుగులు చనిపోయాయి. ఏనుగులు ఎలా చనిపోయాయనే విషయం అంతు చిక్కడం లేదు. వాటర్‌‌ హోల్స్‌ చుట్టూ ఏనుగుల మృతదేహాలు సమూహంగా పడిఉన్నాయని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఛారిటీ నేషనల్‌ పార్క్‌ రెస్క్యూ కన్జర్వేషన్‌ డైరెక్టర్‌‌ నియాల్‌ మక్కాన్‌ చెప్పారు. అదే ఏరియాలోని మరికొన్ని ఏనుగులు నీరసంగా కనిపించాయని, చుట్టూ గిరగిర తిరుగుతున్నాయని అజ్జర్వర్స్‌ చెప్పారు. ఏనుగుల్లో ఉన్న లక్షణాలు మిగతా జంతువుల్లో మాత్రం కనిపించలేదని అన్నారు. ఏనుగుల మరణానికి కారణాలు తెలియలేదని, దానికి సంబంధించి టెస్టులు చేస్తున్నారని అధికారులు చెప్పారు. ఏనుగులు చనిపోవడం మే నుంచి మొదలైందని మక్కాన్‌ చెప్పారు. కరోనా కూడా ఈ మరణానికి కారణమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇది ప్రజారోగ్య సంక్షోభం అయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కారణం ఏదైనప్పటికీ చాలా ఏనుగులు చనిపోయాయని ఆయన అన్నారు. ఒకవేళ ఇది వేటగాళ్ల సయనైడ్‌ ఎటాక్‌ అయితే ఇంకా ఎన్నో మరణాలు సంభవించే అవకాశం ఉందని చెప్పారు.

10 శాతం ఏనుగులు ఇక్కడే ఉంటాయి

ఒక్క బోట్స్వానాలోనే దాదాపు 1,30,000ఏనుగులు ఉంటాయి. ఖండంలోని మిగతా దేశాల్లో ఎక్కడ ఇన్ని ఏనుగులు కనిపించవు. దాంట్లో కూడా దాదాపు10 వాతం ఏనుగులు ఒకవాంగా డెల్టాలోనే ఉన్నాయి. 2014 నుంచి అమలులో ఉన్న ఏనుగుల వేట నిషేధ చట్టాన్ని బోట్స్వానా రద్దు చేసింది. దీంతో అప్పటి నుంచి ఏనుగు దంతాల కోసం వేటగాళ్లు దాడులు చేస్తున్నారని అధికారులు చెప్పారు. ఇది కూడా అదే దాడి అని అనుమనిస్తున్నారు. కాగా.. చట్టాన్ని రద్దు చేయడంపై బోట్స్వానా ప్రభుత్వంపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి.