షాకింగ్ ఇన్సిడెంట్.. అదనపు కట్నం కింద డబ్బు, నగదు పట్టుకు రమ్మని హింసించే ఈ ఈ రోజుల్లో కోడలికోసం ఓ అత్త చేసిన ఈ పని చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఈ మధ్య కాలంలో లవర్ కోసం దొంగతనాలు చేస్తున్న యూత్ స్టోరీలు మనం చూశాం.. విన్నాం.. అయితే ఇక్కడ కోడలికోసం అత్త దొంగతనం చేసింది. ఏకంగా ఓనర్ ఇంట్లోనే చోరీ చేసింది..గుజరాత్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుజరాత్ లోని సూరత్ లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. కోడలికి బంగారం గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఓ అత్త దొంగగా మారింది. అద్దెకు ఉంటున్న ఇంటికే కన్నం వేసింది. అదనుచూసి ఒనర్ ఇంట్లో దాదాపు 17 లక్షల విలువైన 15 తులాల బంగారం ఆభరణాలు దొంగిలించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె గుట్టురట్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు .దొంగిలించిన నగలు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు దొంగతనం చేశావని అడిగితే ఆమె చెప్పిన సాకు చూసి షాక్ అయ్యారు పోలీసులు.
అసలేం జరిగిందంటే..
సూరత్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న 42 ఏళ్ల శిల్పాబెన్ పద్మణి, తన కొడుకు ట్యూషన్‌కు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేయడం మర్చిపోయారు. ఆమె అపార్ట్‌మెంట్‌కు పక్కనే మొదటి అంతస్తులో నివసించే ఒక మహిళ ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని, వార్డ్‌రోబ్‌లోని నగలను దొంగిలించింది.
ALSO READ : ఆ రెండు విషయాలు తప్ప.. నిజమైన ఇండియాను చూశా
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..
బాధిత టీచర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా అద్దెకు ఉంటున్న మహిళను పిలిపించి క్షుణ్ణంగా విచారించడం అసలు విషయం బయటపడింది. తన కొడుకుకు ప్రేమ వివాహం జరిగిందని, కోడలికి బంగారు ఆభరణాలు బహుమతిగా ఇవ్వాలనుకున్నానని. అందుకే ఆమె ఇంటి యజమాని ఇంట్లో ఈ దొంగతనం చేసినట్లు తెలిపింది.
ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. మొదట నిందితురాలైన ఆ మహిళ తాను నగలు కేవలం 3.36 లక్షల రూపాయలకే అమ్మినట్లు పోలీసులను తప్పుదోవ పట్టించింది. అమ్మిన సొమ్ములో 2 లక్షల రూపాయలు రోడ్డుపై పడిపోయాయని కూడా ఆమె చెప్పింది. అయితే, పోలీసులు ఆమె మాటలను నమ్మలేదు. ఆ తర్వాత, బాల్కనీలో ఉంచిన ఒక పెట్టెలోంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
