ఆ రెండు విషయాలు తప్ప.. నిజమైన ఇండియాను చూశా..: భారత్‌పై సింగపూర్ మహిళ ప్రశంసలు..

ఆ రెండు విషయాలు తప్ప.. నిజమైన ఇండియాను చూశా..: భారత్‌పై సింగపూర్ మహిళ ప్రశంసలు..

సింగపూర్‌కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు ఉత్తర భారతదేశంలో ప్రయాణించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఒక చిన్న  రీల్ ద్వారా ఆమె హవా మహల్, తాజ్ మహల్, ఎర్రకోట వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూపించింది. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన మంచి, చెడు అనుభవాలు రెండింటినీ ఆమె బయటపెట్టింది. ఇంటర్నెట్‌లో భారతదేశం గురించి వచ్చే నెగెటివ్ వార్తలను నమ్మకుండా, సింగపూర్‌లో పెరిగిన ఆమెకి నిజమైన భారతదేశాన్ని కళ్లారా చూడాలనే ఆశ కలిగిందని ఆమె క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.

ఎదురైన ఇబ్బందులు
ఉత్తర భారతదేశంలో  మొదటి ప్రయాణం ఎలా సాగిందో చెప్తూ, కొన్నిసార్లు అక్కడి వాతావరణం  చాలా గజిబిజిగా అనిపించిందని చెప్పింది. దుమ్ము, విపరీతమైన ట్రాఫిక్ వల్ల కాస్త ఇబ్బందిగా అనిపించింది అంటూ పోస్టులో రాసింది. మగవాళ్లే కాకుండా, ఆడవాళ్లు కూడా తన వైపు వింతగా చూడటాన్ని గమనించానని చెప్పింది. అలాగే చాలా వరకు రోడ్ల మీద చెత్తాచెదారం ఉందని.. మీరు ప్రశాంతంగా, రిలాక్స్ అవ్వడానికి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే... ఈ ప్లేస్ దానికి సెట్ అవ్వదు అని ఓపెన్ గా చెప్పేసింది.

నచ్చిన విషయాలు
అయితే, కొన్ని ఇబ్బందులు ఉన్న... భారతదేశంలోని సంస్కృతి, చరిత్ర, అక్కడి సందడి తనకు ఎంతగానో నచ్చాయని ఆమె  చెప్పింది. ఆమె ఇప్పటివరకు చూసిన అత్యంత అందమైన దేశాల్లో ఇండియా ఒకటని పొగిడింది కూడా. ఇక్కడి ప్రతి చోటా ఒక చరిత్ర, ఒక కథ ఉంది. ఇంత కలర్‌ఫుల్‌గా, ఎప్పుడూ సందడిగా ఉండే నగరాలను నేను లైఫ్‌లో చూడలేదు అని చెబుతూ.. ఈ జర్నీ తన మనసుపై బలమైన ముద్ర వేసిందని పేర్కొంది. మొదట్లో ఇక్కడి వాతావరణం కాస్త కష్టంగా అనిపించినా, ప్రయాణంలో తన సేఫ్టీ గురించి, మంచి గురించి మనస్ఫూర్తిగా కేర్ తీసుకునే మంచి వ్యక్తులు తనకు పరిచయమయ్యారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

ALSO READ : పెట్రోల్, డీజిల్ పై రూ.3 పెంచినా కంపెనీలకు నష్టాలు తగ్గట్లే..

భారతదేశంలో ఒంటరిగా ప్రయాణం చేయడం సురక్షితమేనా..? అనే అనుమానాలపై స్పందిస్తూ... నేను గతంలో తిరిగిన ఎన్నో డెవలప్ అయిన నగరాల కంటే, భారతదేశంలోనే తనకు ఎక్కువ సేఫ్‌గా అనిపించిందని ఆమె స్పష్టం చేసింది.