
నిర్మల్, వెలుగు: ఆర్జీయూకేటీ, తెలంగాణ ప్రభుత్వ మహిళా అభివృద్ధి కేంద్రం, వీహబ్ల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనిపై వర్సిటీ అధికారులు, వీహబ్ ప్రతినిధులు సంతకాలు చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా గ్రామీణ విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడినవారికి వృత్తిపరమైన శిక్షణ, ఇంటర్న్ షిప్ అవకాశాలు లభిస్తాయన్నారు.
ఉపాధి అవకాశాలను మెరుగవడమే కాకుండా వీహబ్ మెంటార్‌షిప్, స్కిల్స్ ట్రైనింగ్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మద్దతు వంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహనను కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఎంఓయూ కుదరడంలో కీలకపాత్ర పోషించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వీహబ్‌తో కలిసి పని చేయడం ద్వారా గ్రామీణ విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, నైపుణ్యాలు పెంపొందే అవకాశాలు విస్తృతమవుతాయని పేర్కొన్నారు. ఓఎస్ డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఉద్యోగులు ఉన్నారు.