పొద్దున లేస్తే కొడుకు అయ్య డబ్బా..అయ్య కొడుకు డబ్బా

పొద్దున లేస్తే కొడుకు అయ్య డబ్బా..అయ్య కొడుకు డబ్బా

కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. కరోనా సమయంలో గల్ఫ్ కార్మికులు ఇబ్బందులు పడితే అక్కడి నుంచి వచ్చిన వాళ్లకు ఫ్రీ క్వారంటైన్ కూడా కల్పించలేకపోగా.. ఫ్రీ క్వారంటైన్ కు వచ్చిన వాళ్ల దగ్గర కూడా డబ్బులు వసూళ్లు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం అని విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన బీజేపి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన అర్వింద్.. కోవిడ్ సమయంలో కోరుట్ల బీజేపీ నాయకులు చేసిన సేవ, చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. జేపీనడ్డా కళ్లు కూడా ఇక్కడి సేవలు చూసి చమర్చాయన్నారు.

ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలుపుతున్నా.. అది రాష్ట్రంలో ఎక్కడైనా అమలవుతుందా అని అన్నారు అర్వింద్. మొదటివేవ్, రెండో వేవ్ అయిపోయి మూడో వేవ్ కూడా దగ్గరకు వస్తోందన్నారు. పొద్దున లేస్తే కొడుకు అయ్య డబ్బా... అయ్య కొడుకు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. మంత్రివర్గంలో ఒకే ఒక్క మంత్రి ఈటల పనిచేస్తే ఆయన్ను వెళ్లగొట్టారన్నారు. త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో.. కేసీఆర్ కు బీజేపీ తగిన గుణపాఠం చెప్పబోతోందని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు అక్కడో పది.. ఇక్కడో పది కట్టి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు అర్వింద్.