15 Saves In 90 Minutes: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) గ్రూప్-ఈ లో శనివారం రాత్రి అద్భుతం జరిగింది. కెరిబియన్ దీవుల్లోని అత్యంత చిన్న దేశమైన కురకావ్ (Curacao) ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే రికార్డు క్రియేట్ చేసింది. పవర్‌ఫుల్ ఈక్వెడార్ జట్టు లీగ్‌లో భీభత్సమైన అటాకింగ్‌ను ఒంటిచేత్తో అడ్డుకుంటూ ఆ దేశ గోల్ కీపర్ ఎలోయ్ రూమ్ (Eloy Room) హిస్టారికల్ పర్ఫామెన్స్ చేశాడు. ఏకంగా 15 అద్భుతమైన సేవ్స్ చేసి మ్యాచ్‌ను 0–0తో డ్రా చేయడమే కాకుండా.. కురకావ్ దేశానికి వరల్డ్ కప్ హిస్టరీలోనే మొట్ట మొదటి పాయింట్‌ను అందించాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో జర్మనీ టీమ్ గ్రూప్-ఈ నుంచి నాకౌట్‌కు క్వాలిఫై అయింది.
90 నిమిషాల్లో 15 సేవ్స్:
ఈ 37 ఏళ్ల వెటరన్ గోల్ కీపర్ ఎలోయ్ రూమ్ గ్రౌండ్‌లో ఒక గోడలా నిలబడిపోయాడు. ఈక్వెడార్ ప్లేయర్స్ కొట్టిన 27 షాట్లలో.. గోల్ పోస్ట్‌కు టార్గెట్ అయిన 15 డేంజరస్ షాట్లను అడ్డుకున్నాడు. ఇందులో 10 సేవ్స్ బాక్స్ లోపల నుంచి వచ్చినవే కావడం విశేషం. కాగా వరల్డ్ కప్ హిస్టరీలో 1966 నుంచి అధికారికంగా సేవ్స్ లెక్కించడం మొదలుపెట్టాక.. అమెరికా కీపర్ తిమ్ హోవార్డ్ (బెల్జియంపై 16 సేవ్స్) పేరిట టాప్ రికార్డు ఉంది. అయితే హోవార్డ్ ఆ రికార్డును 120 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ మ్యాచ్‌లో సాధించాడు. కానీ కేవలం 90 నిమిషాల రెగ్యులర్ టైమ్‌లో 15 సేవ్స్ చేసిన ఏకైక కీపర్‌గా ఎలోయ్ రూమ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.
►ALSO READ | ఇదెక్కడి న్యాయం.. సెంచరీ చేసిన సరిపోదా..! ఇంగ్లాండ్ టూర్‌కు జైస్వాల్‌కు నో ఛాన్స్
స్టేడియంలో నెదర్లాండ్స్ రాజు, రాణి డ్యాన్స్:
ఈ మ్యాచ్ కాన్సాస్ సిటీలోని చీఫ్స్ స్టేడియంలో జరిగింది. స్టేడియం మొత్తం ఈక్వెడార్ ఫ్యాన్స్ పసుపు రంగు జెర్సీలతో నిండిపోవడంతో అచ్చం మినియన్స్ (Minions) ప్రపంచంలా కనిపించింది. కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్న కురకావ్ ఫ్యాన్స్‌కు సపోర్ట్‌గా నెదర్లాండ్స్ రాజు విల్లెమ్- అలెగ్జాండర్, రాణి మాక్సిమాలు స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చి మ్యాచ్ చూశారు. మ్యాచ్ అయ్యాక వాళ్లు కురకావ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ప్లేయర్స్‌తో కలిసి మ్యూజిక్‌కు డ్యాన్స్ చేశారు.
ఈక్వెడార్‌కు చావో రేవో:
ఈ మ్యాచ్ కంటే ముందు జర్మనీ జట్టు 2–1 తేడాతో ఐవరీ కోస్ట్‌పై గెలవడంతో ఈక్వెడార్‌పై విపరీతమైన ప్రెజర్ పడింది. ఈ మ్యాచ్‌లో కురకావ్‌తో డ్రా చేసుకోవడంతో ఈక్వెడార్ నాకౌట్ అవకాశాలు క్లిష్టమయ్యాయి. వచ్చే గురువారం జరగబోయే చివరి గ్రూప్ మ్యాచ్‌ల్లో కురకావ్ జట్టు ఐవరీ కోస్ట్‌తో ఫిలడెల్ఫియాలో తలపడనుండగా.. ఈక్వెడార్ జట్టు న్యూయార్క్‌లో జర్మనీతో తలపడాల్సి ఉంది.
Eloy Room - Record breaker
— Football Performances (@FCPerformances) June 21, 2026
All 15 saves against 🇪🇨
Top performance 👏 pic.twitter.com/T4bKUeyyGU
