గ‌ణేష్ ఉత్స‌వాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌త లేదు

గ‌ణేష్ ఉత్స‌వాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌త లేదు

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి స్పష్టత లేదని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఉద్దేశ పూర్వకంగానే వినాయక ఉత్సవాల నిర్వహణను తప్పుదారి పట్టిస్తోందని అన్నారు. స్పష్టత లేని రాష్ట్ర పాలకులు, అధికారులు హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, ఇది ఆక్షేపనీయం, గర్హనీయమ‌ని అన్నారు.

గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై ఎంపీ మంగ‌ళ‌వారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ధార్మిక సంస్థలు, హిందూ ఉత్సవ సమితులు నిర్దేశించిన విధంగా గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వ‌హించుకోవాల‌ని సంజ‌య్ అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో పోలీసు అధికారులు తమ ఇష్టానుసారంగా ఉత్సవాల నిర్వహణకు విరుద్ధంగా నిబంధనలు విధిస్తూ… ఉత్సవ నిర్వాహకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని.. గణేశ్ ఉత్సవ నిర్వాహకులకు బీజేపీ అండగా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.

సమాజాన్ని సంఘటితం చేసే గణేష్ ఉత్సవాలకు నాంది పలికిన బాల గంగాధర్ తిలక్ ఆదర్శాలు అనుసరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకునేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉందని బండి సంజ‌య్ అన్నారు. కోవిడ్ నిబంధనల సాకుతో టీఆర్ఎస్ నేతలు అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలు ప్రజలు గమనించాల‌న్నారు. కోవిడ్ నిబంధనల పేరిట అధికారులు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను బీజేపీ ధీటుగా ఎదుర్కొటుంద‌ని అన్నారు.

MP Bandi Sanjay says trs government has no clarity on Ganesh celebration