‘తెలుగు స్ర్కైబ్‌‌’పై ఎంపీ చామల ఫిర్యాదు

‘తెలుగు స్ర్కైబ్‌‌’పై ఎంపీ చామల ఫిర్యాదు

హైదరాబాద్‌‌, వెలుగు:  సీఎం రేవంత్‌‌రెడ్డిపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న ‘తెలుగు స్క్రైబ్‌‌’ సహా పలు సోషల్ మీడియా హ్యాండిళ్లపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌రెడ్డి బుధవారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌‌ను తిరస్కరించడం వెనుక  సీఎం రేవంత్‌‌రెడ్డి కుట్ర ఉందంటూ ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. సీఎం రేవంత్‌‌రెడ్డి రాజకీయ ప్రతిష్ట, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలుగు స్క్రైబ్ వ్యవహరిస్తున్నదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.