తెలంగాణ కష్టాలను పట్టించుకోండి: ఎంపీ వంశీకృష్ణ

తెలంగాణ కష్టాలను పట్టించుకోండి: ఎంపీ వంశీకృష్ణ

 తెలంగాణకు కేంద్రం  బకాయిలు చెల్లించాలనన్నారు పెద్దపల్లి  ఎంపీ వంశీకృష్ణ . లోక్ సభలో మాట్లాడిన ఆయన.. ఏపీ చేపట్టిన బనకచర్లతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు ఎంపీ వంశీ.  తెలంగాణకు రావాల్సిన 200 టీఎంసీల నీళ్లు ఏపీ డైవర్ట్ చేస్తుందని ఆరోపించారు. బనకచర్లతో వందలాది ఎకరాలు నీట మునుగుతదన్నారు. తెలంగాణ కష్టాల మీద ప్రధాని మోదీ దృష్టిపెట్టాలన్నారు.

పెద్దపల్లి జిల్లాకు  ఏర్పాట  మంజూరు చేయాలని  పెద్దపల్లి  ఎంపీ వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లాకు ఎయిర్ పోర్టు కోసం రిక్వెస్ట్ చేశామన్నారు.   పెద్దపల్లి జిల్లాకు ఎయిర్ పోర్టు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో గ్రీన్​ ఫీల్డ్​ ఎయిర్​పోర్టు ఏర్పాటుకు  అంతర్గాం మండల కేంద్రంలో ఎయిర్​పోర్టు నిర్మాణం కోసం 591 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఎయిర్​ పోర్టు నిర్మాణం సాధ్యమవుతుందా అనే విషయమై ప్రీ ఫిజిబులిటీ స్టడీ చేసేందుకు రూ.40.53 లక్షల ఫీజును ఎయిర్​ పోర్టు అథారిటీ ఆఫ్​ ఇండియాకు చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్​ ఛీప్​ సెక్రటరీ వికాస్​ రాజ్  గతేడాది (2025)లో  ఉత్తర్వులు జారీ చేశారు.