సంచార జాతుల సంరక్షణకు బీజేపీ కృషి చేస్తుంది

సంచార జాతుల సంరక్షణకు  బీజేపీ కృషి చేస్తుంది

సంచార జాతుల సంరక్షణకు బీజేపీ కృషి చేస్తోందని రాజ్యసభ సభ్యులు, ఓబీసి మోర్చా జాతీయ అధ్యక్షులు కె. లక్ష్మణ్ అన్నారు. సంచార జాతుల అభివృద్ధికి SEED పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ కొత్తపేటలోని బీజేఆర్ భవన్ లో విముక్త, సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన 70వ విముక్త దివస్ కు కె. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

రూ. 200 అని చెప్పి..రూ. 7 కోట్లే ఖర్చు చేసింది..
రాష్ట్రంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి..కేవలం రూ.7కోట్లే ఖర్చు చేసిందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. సంచార జాతులకు DNT కమిషన్ ఏర్పాటు చేయాలని, అన్ని రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కేంద్రం సీడ్ పథకం కింద సంచార జాతులకు విద్య, వైద్యం, ఇన్సూరెన్స్ హౌసింగ్ స్కీమ్ లను అమలు చేస్తోందని గుర్తు చేశారు.