IPL 2026: వర్షం కారణంగా పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రద్దు

IPL 2026: వర్షం కారణంగా పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రద్దు

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఈడెన్ గార్జెన్స్ వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ రద్దు అయింది. టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది.  మొదట బ్యాటింగ్ కి వచ్చిన కేకేఆర్ కి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. దీంతో క్రీజులోకి వచ్చిన కేకేఆర్ ఓపెనర్లు ఫస్ట్ ఓవర్లోనే దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత బౌలింగ్ కి వచ్చిన జేవియర్ బార్ట్‌లెట్ కోల్‌కతా జట్టుకి బిగ్ షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో కీలకమైన ఇద్దరు స్టార్ బ్యాటర్లని ఔట్ చేశాడు.

పంజాబ్ బౌలర్ జేవియర్ బౌలింగ్(1.4)  వేసిన అద్భుతమైన బంతికి కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ (6) వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కి క్యాచ్ ఇచ్చి స్టేడియం బయటకి వెళ్లిపోయాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన స్టార్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ (4) వచ్చి రాగానే ఓ ఫోర్ కొట్టిన తర్వాత బంతికే జేవియర్ బౌలింగ్(1.6)లోనే పంజాబ్ వికెట్ కీపర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకోవడంతో.. 16 పరుగులకే కీలకమైన రెండు వికెట్లని కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రఘువంశీ(2)తో కలిసి కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే(8) ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో వరుణుడు మ్యాచ్ జరగకుండా అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్ కేవలం 3.4 ఓవర్లు మాత్రమే సాగిన తర్వాత భారీగా వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ ని ఆపేశారు. 

ఇక సుమారు 3 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షం ఆగిపోవడంతో రాత్రి 10: 35 నిమిషాలకు స్టేడియాన్ని అంపైర్లు పరిశీలించారు. మైదానం ప్రస్తుత పరిస్థితి పూర్తిగా చెక్ చేసిన తర్వాత 11:14 గంటలకి 5 ఓవర్లు పాటు జరిపేందుకు నిర్ణించిన తర్వాత పిచ్ పై తేమ ఉందని తేలడంతో.. పూర్తిగా మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్లు కేకేఆర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ లకి చెప్పారు. ఈ మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కేకేఆర్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.