అధికారులపై దాడిని ఖండిస్తున్నాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అధికారులపై దాడిని ఖండిస్తున్నాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మహిళ అటవీ అధికారి అనితపై ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సోదరుడు కృష్ణ  చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని  రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మీడియాకు ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రభుత్వ అధికారులు వాళ్ల విధులు వారు నిర్వహిస్తున్న సమయంలో టిఆర్ఎస్ నాయకులు కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం దారుణమని లేఖలో పేర్కొన్నారు.

బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడం హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి దాడులను ఎదురుకోవడానికి అటవీ శాఖ అధికారులకు  ప్రభుత్వం ఆయుధాలు ఇవ్వాలన్నారు. ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి అన్నారు.