ముకేశే మళ్లీ ఆసియా రారాజు

ముకేశే మళ్లీ ఆసియా రారాజు
  • రెండో ప్లేస్​కి దిగిన జాంగ్​ షాన్​షన్​

న్యూఢిల్లీ: చైనా సంపన్నుడు జాంగ్​ షాన్​షన్​ను వెనక్కినెట్టి మళ్లీ ఆసియా సంపన్నుడయ్యారు ముకేశ్​ అంబానీ. జాంగ్​ షాన్​షన్​ ఓనరయిన బాటిల్డ్​ వాటర్​ కంపెనీ షేర్లు గత వారం రోజుల్లో 20 శాతం పతనం కావడంతో 80 బిలియన్​ డాలర్ల సంపదతో ముకేశ్​ ముందుకు దూసుకెళ్లారు. చైనా బిలినియర్​ సంపద కిందటి వారంలో 22 బిలియన్​ డాలర్లకు పైగా తగ్గి 76.6 బిలియన్​ డాలర్లకు చేరింది. అలీబాబా గ్రూప్​ ఫౌండరయిన జాక్​ మా నుంచి ఆసియా సంపన్నుడి కిరీటాన్ని అందుకున్న ముకేశ్​ గత రెండేళ్లలో ఎక్కువకాలమే దానిని నిలబెట్టుకోగలిగారు. డిసెంబర్​లో జాంగ్​ కంపెనీలు రెండు స్టాక్​ మార్కెట్లలో లిస్ట్​ కావడంతో ముకేశ్​ తన కిరీటాన్ని పోగొట్టుకోవల్సి వచ్చింది. ఇతర మార్కెట్లతోపాటు ఇండియా స్టాక్​మార్కెట్లూ పతనమైనా, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ షేరు పెద్దగా పడకపోవడంతో ముకేశ్​ సంపద స్థిరంగా నిలిచింది. ఆయిల్​ బిజినెస్​ను సెపరేట్​ కంపెనీగా ఏర్పాటు చేస్తున్నట్లు కిందటి వారంలోనే రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ప్రకటించింది. ఈ కారణంగానే ఆ కంపెనీ షేరు పెద్దగా పడకుండా నిలిచిందని అంచనా వేస్తున్నారు. ఆయిల్​ కంపెనీలో సౌదీ కంపెనీ ఆరామ్​కో పెట్టుబడులు పెడుతుందనే ఆశాభావంతో ముకేశ్​ ఉన్నారు. ఇందుకోసమే దానిని సెపరేట్​ చేశారు. దీంతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని
భావిస్తున్నారు.