అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు విఫలం కావటంతో మన స్టాక్ మార్కెట్ల దారుణంగా పడ్డాయి. 2026, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం.. మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి.
- సెన్సెక్స్ 16 వందల పాయింట్ల వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 400 పాయింట్ల వరకు డౌన్ అయ్యింది.
- ఆ తర్వాత కొద్ది కొద్దిగా రికవరీ అయిన స్టాక్ మార్కెట్లు.. ఉదయం 10 గంటల సమయానికి కొంచెంలో కొంచెం నష్టాలను తగ్గించుకోగలిగాయి.సెన్సెన్స్ 14 వందల పాయింట్లు.. నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయాయి.
- సెన్సెక్స్, నిఫ్టీ ఓవరాల్ ఒకటిన్నర శాతం నష్టపోయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయ్యింది.
ఆసియా దేశాలకు క్రూడ్ ఆయిల్ సరఫరా అయ్యే హర్మూజ్ జల సంధిని మేమే దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించటంతో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ ఆయిల్ 7 శాతం పెరిగి... బ్యారల్ 102 డాలర్లకు చేరుకున్నది.
మన స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ 2 శాతం నష్టపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు అన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
