హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మైక్రోసాఫ్ట్  భారీ డేటా సెంటర్ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మైక్రోసాఫ్ట్  భారీ డేటా సెంటర్ ప్రారంభం
  •     రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడి
  •     సుమారు 116 ఎకరాల్లో ఏర్పాటు

  
హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్​ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతదేశంలో తన అతిపెద్ద డేటా సెంటర్‌‌‌‌ను గురువారం హైదరాబాద్‌‌‌‌లో అధికారికంగా ప్రారంభించింది.  ఏఐ మార్కెట్‌‌‌‌లో పోటీ పడేందుకు అదానీ గ్రూప్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సుమారు 116 ఎకరాల విస్తీర్ణంలో ఈ డేటా సెంటర్ల సముదాయం ఏర్పాటయింది. వీటికోసం రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టామని తెలిపింది.  ఇందులోని మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సెక్యూరిటీ, ఐటీ ఆపరేషన్స్, క్యాంపస్ మేనేజ్‌‌‌‌మెంట్ విభాగాలలో వందలాది మంది పనిచేస్తారు.

ఈ కొత్త సౌకర్యం ద్వారా భారతదేశంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్‌‌‌‌ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇప్పటికే పుణె, చెన్నై, ముంబైలో ఈ సంస్థకు క్లౌడ్ సెంటర్లు ఉన్నాయి. దీని ద్వారా దేశంలోనే టాప్​ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్‌‌‌‌గా మైక్రోసాఫ్ట్  ఎదిగింది. ఇండియాలో దాదాపు రూ.1,95,221.5 కోట్ల పెట్టుబడికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.  తమ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అజూర్ గత రెండేళ్లుగా భారత్​లో రెండంకెల వృద్ధి రేటును సాధిస్తోందని వెల్లడించింది.   జియోతో కలిసి మైక్రోసాఫ్ట్ దేశంలో మరో రెండు డేటా సెంటర్లను కూడా నిర్వహిస్తోంది.