హైదరాబాద్, వెలుగు: సన్ అండ్ మూన్ లైటింగ్ స్టూడియో ఎక్స్పీరియన్స్ సెంటర్ హైదరాబాద్‌లో ఆదివారం ప్రారంభమైంది. ఇది ఆధునిక లైటింగ్ హోమ్ ఆటోమేషన్ సేవలను అందిస్తోంది. లియోస్ బ్రాండ్ ద్వారా ప్రీమియం ఆర్కిటెక్చరల్ లైటింగ్, వైట్‌లయన్ ద్వారా హోమ్ ఆటోమేషన్ పరిష్కారాలను మార్కెట్లోకి తెచ్చింది.
టెక్నాలజీ, డిజైన్ కలయికతో గృహ వినియోగదారులకు ఆధునిక జీవన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో హోమ్ ఆటోమేషన్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ స్టూడియో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. ఆర్కిటెక్టులు, డిజైనర్లు, కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి ఇక్కడ సొల్యూషన్లు లభిస్తాయని తెలియజేసింది.
