ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ పంపిన ఒక వింతైన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అమెరికాతో చర్చలు విఫలమైన తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తానని బెదిరించడంతో, ఇరాన్ ఒక కోడ్ లాంగ్వేజ్ మెసేజుతో స్పందించింది. సాధారణ రాజకీయ హెచ్చరికలకు బదులుగా, ఈసారి హెచ్చరిక పంపడానికి మ్యాథ్స్ స్టయిల్లో ఒక ఫార్ములాను ఉపయోగించింది.
ఏమిటా ఫార్ములా?
ఘాలిబాఫ్ పంపిన మెసేజ్ : $ΔO_{BSOH}>0 ⇒ f(f(O))>f(O)$
O = చమురు ధర లేదా చమురు సంక్షోభం.
BSOH = హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం.
ΔOBSOH>0ΔOBSOH>0 = దిగ్బంధనం చమురు ధరలను పెంచుతుంది.
f(f(O))>f(O)f(f(O))>f(O) = రెండవ రౌండ్ ప్రభావం మొదటి రౌండ్ ప్రభావం కంటే దారుణంగా ఉంటుంది.
1.మొదటి భాగం $ΔO_{BSOH}>0$ ఇక్కడ 'O' అంటే చమురు (Oil) ధరలు, 'BSOH' అంటే హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం. అంటే, అమెరికా హోర్ముజ్ జలసంధిని అడ్డుకుంటే, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తక్షణమే పెరుగుతాయి.
2.రెండవ భాగం $f(f(O))>f(O)$ అర్ధం ధరలు పెరగడం అక్కడితో ఆగదు. మొదటిసారి పెరిగిన ధర కంటే, ఆ తర్వాత ధరల పెరుగుదల (Second round effect) చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో భయాందోళనలు, సరఫరా అడ్డంకులు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల ధరలు ఆకాశాన్ని తాకుతాయని దీని అర్థం.
ఇరాన్ హెచ్చరిక :
వైట్ హౌస్ సమీపంలోని పెట్రోల్ బంకుల ఫోటోలను షేర్ చేస్తూ, "ప్రస్తుత ధరలను చూసి సంతోషించండి, త్వరలో ఇవి 4 నుండి 5 డాలర్లకు పెరుగుతాయి అని ఘాలిబాఫ్ హెచ్చరించారు. ఒకసారి ధరలు పెరగడం మొదలైతే, అది ఒక చైన్ లాగ మారి అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ఇరాన్ చెబుతోంది.
ఇరాన్ ఓడరేవుల నుండి వచ్చే నౌకలను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. సోమవారం నుండి ఈ దిగ్బంధనం అమలులోకి వస్తుందని అమెరికా సైన్యం తెలిపింది. అయితే, ఇరాన్ మాత్రం ఈ చర్య అమెరికాకే నష్టమని, పెట్రోల్ ధరల రూపంలో సాధారణ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఒక మ్యాథ్స్ కోడ్ బాషా ద్వారా హెచ్చరిస్తోంది.
మొత్తంగా చూస్తే మీరు మమ్మల్ని ఆపాలని చూస్తే, ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది, అది మీరు ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుంది అని ఇరాన్ స్పష్టంగా హెచ్చరిస్తోంది.

