Mumbai Indians: ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2026, ఏప్రిల్ 23న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, ముంబై ఇండియన్స్ కేవలం 104 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 103 రన్స్ తేడాతో ఓడిపోవడం ముంబై చరిత్రలోనే అతిపెద్ద ఓటమిగా నమోదైంది. గత 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎంఐకి ఇంతటి అవమానకర ఓటమి ఎప్పుడూ రాలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దారుణంగా రన్ రేట్:
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రయాణం సగం పూర్తి అయిపోయింది. 7 మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించిన ముంబై, 4 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. సీఎస్కేపై భారీ ఓటమి వల్ల ముంబై నెట్ రన్ రేట్ (-0.736) దారుణంగా పడిపోయింది. ఇక టోర్నమెంట్ లో ముందంజ వేయాలంటే రన్ రేట్ అత్యంత కీలకం కాబోతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు జట్టుకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేవు.
ముంబై ప్లేఆఫ్స్ చేరాలంటే?:
ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరడం ఇప్పుడు చాలా కష్టమైంది. సాధారణంగా ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే కనీసం 16 పాయింట్లు ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ముంబై తన మిగిలిన 7 మ్యాచ్‌లలో కనీసం 6 మ్యాచులలో విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం విజయాలే సరిపోవు, నెట్ రన్ రేట్‌ను కూడా భారీగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్యా సేన ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే ఇది అసాధ్యమైన పనిగా చెప్పాలి. కానీ క్రికెట్లో ఏదైనా జరగొచ్చు.
►ALSO READ | నీవు ఎంత మంచి వాడివయ్యా.. డ్యూటీలోని పోలీసులకే సెల్ఫీ ఇచ్చిన క్రికెట్ దేవుడు
ముంబై తర్వాత ఆడేది ఈ జట్లతోనే:
ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే రాబోయే మ్యాచ్‌లలో సమిష్టిగా రాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడు మ్యాచ్‌లలో ముంబై అద్భుతాలు చేస్తేనే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లగలదు.
* ఏప్రిల్ 29: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబై)
* మే 02: చెన్నై సూపర్ కింగ్స్ (చెన్నై)
* మే 04: లక్నో సూపర్ జెయింట్స్ (ముంబై)
* మే 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రాయ్‌పూర్)
* మే 14: పంజాబ్ కింగ్స్ (ధర్మశాల)
* మే 20: కోల్‌కతా నైట్ రైడర్స్ (కోల్‌కతా)
* మే 24: రాజస్థాన్ రాయల్స్ (ముంబై)

