బాలీవుడ్ క్యూట్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. వీరిద్దరూ 2024 ఫిబ్రవరిలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ జంట సరదాగా వాడిన 'సిట్యుయేషన్‌షిప్' అనే పదం నెట్టింట పెద్ద దుమారాన్నే రేపింది. దీంతో ఈ వ్యాఖ్యలపై రకుల్ లేటెస్ట్ గా స్పందించారు. కేవలం ఒకే ఒక్క పదాన్ని పట్టుకుని రాద్ధాతం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వివరణ ఇచ్చారు.
అసలేం జరిగింది?
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ మాట్లాడుతూ.. రకుల్, నేను పెళ్లి చేసుకున్నాం. కానీ మా మధ్య ఇప్పటికీ ఒక సిట్యుయేషన్‌షిప్ నడుస్తోంది. అంటే.. మేమిద్దరం ఒకరికొకరు మాత్రమే పరిమితం, అందుకే పెళ్లి చేసుకున్నాం. అయితే మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఆమెతో ఏదైనా మాట్లాడగలను, నా మనసులోని మాటను పంచుకోగలను అని వ్యాఖ్యానించారు. సాధారణంగా 'సిట్యుయేషన్‌షిప్' అంటే బాధ్యత లేని సంబంధం అనే అర్థం వస్తుంది, కానీ జాకీ ఇక్కడ వారి మధ్య ఉన్న స్నేహాన్ని, కంఫర్ట్‌ను ఉద్దేశించి ఆ పదాన్ని వాడారు.
రకుల్ క్లారిటీ.. ఆవేదన
తన వైవాహిక బంధంపై వస్తున్న వార్తలను చూసి రకుల్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఒక గంట పాటు జరిగిన సంభాషణలో ఒకే ఒక్క లైన్‌ను తీసుకుని ఇలా హెడ్‌లైన్స్ మార్చడం చూస్తుంటే నవ్వు వస్తోంది. సందర్భం, లోతును అర్థం చేసుకోకుండా కేవలం క్లిక్‌బైట్స్ కోసం ఇలాంటి వార్తలు రాయడం బాధ్యతారాహిత్యం. ఇప్పుడైనా వార్తా సంస్థలు నిజాయితీగా వ్యవహరించాలి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.
►ALSO READ | Prabhas: రికార్డులు తిరగరాస్తున్న 'డార్లింగ్'.. గబ్బర్ సింగ్, ఖలేజా వసూళ్లను అధిగమించిన రెబల్ స్టార్!
మా బంధం వెనుక రహస్యం ఇదే..
పెళ్లి నిర్ణయం గురించి కూడా ఈ జంట ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేమిద్దరం ఒకరి జీవితంలోని లోటును భర్తీ చేయడం కోసం పెళ్లి చేసుకోలేదు. వ్యక్తిగతంగా మేము ఇప్పటికే సంతోషంగా ఉన్నాం. కలిసి ఉంటే ఆ సంతోషం రెట్టింపు అవుతుందని భావించాం. ఆమె నన్ను హాలిడేకి తీసుకెళ్లలేదని నేను బాధపడను, నా అంతట నేను కూడా వెళ్లగలను. మా మధ్య అంతటి పరిపక్వత ఉంది అని రకుల్ చెప్పుకొచ్చారు.
రకుల్ క్లారిటీతో తెర..
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ 2024, ఫిబ్రవరి 21న గోవా వేదికగా అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. సిక్కు సంప్రదాయం ప్రకారం ఆనంద్ కరాజ్ , సింధీ పద్ధతిలో రెండు రకాలుగా వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఏదేమైనా, వివాదాలకు తావు లేకుండా రకుల్ క్లారిటీ ఇవ్వడంతో ఈ 'సిట్యుయేషన్‌షిప్' చర్చకు తెరపడింది..
Jackky Bhagnani calls marriage with Rakul Preet Singh 'situationship' 😳😱
— FILMYNEWS (@filmynewsnetwrk) April 24, 2026
“Rakul and I are married, but we are like in a situationship, which is, of course, we are exclusive to each other because that’s why we are married. But the most important thing is that I can talk to her… pic.twitter.com/4a3xBLl3Tv

