V6 News

Prabhas: రికార్డులు తిరగరాస్తున్న 'డార్లింగ్'.. గబ్బర్ సింగ్, ఖలేజా వసూళ్లను అధిగమించిన రెబల్ స్టార్!

Prabhas: రికార్డులు తిరగరాస్తున్న 'డార్లింగ్'.. గబ్బర్ సింగ్, ఖలేజా వసూళ్లను అధిగమించిన రెబల్ స్టార్!

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన క్లాసిక్ సినిమాలు, ఇప్పుడు 4K వర్షన్‌లో మళ్ళీ థియేటర్లలోకి వచ్చి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ జాబితాలో చేరి తన సత్తా చాటుకుంది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'డార్లింగ్'. సరిగ్గా 16 ఏళ్ల క్రితం తర్వాత 23 ఏప్రిల్ 2026న రీరిలీజ్ చేశారు మేకర్స్. తొలి రోజు నుంచే ఈ చిత్రం  బిగ్ స్క్రీన్‌పై మళ్ళీ మేజిక్ చేస్తోంది..

రికార్డుల వేటలో 'డార్లింగ్'

రీ-రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేవలం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 7.59 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు జరిగిన తెలుగు రీ-రిలీజ్‌లలో రూ. 19.65 కోట్లతో 'బాహుబలి: ది బిగినింగ్' మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు 'డార్లింగ్' రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్', మహేశ్ బాబు 'ఖలేజా' వంటి భారీ చిత్రాల రీ-రిలీజ్ వసూళ్లను కూడా ప్రభాస్ దాటేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 2 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడవ్వడం రెబల్ స్టార్ రేంజ్‌ను మరోసారి నిరూపించింది.

మళ్ళీ ఆ జ్ఞాపకాలు..

ప్రభాస్ 'బాహుబలి' కంటే ముందు చేసిన సినిమాల్లో 'డార్లింగ్' కి ప్రత్యేక స్థానం ఉంది. యాక్షన్ హీరోగా స్థిరపడుతున్న సమయంలో.. ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన ఈ ప్యూర్ లవ్ స్టోరీ యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభాస్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, ఆ స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ఒక సెన్సేషన్. కాజల్ అగర్వాల్‌తో ఆయన కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది..

►ALSO READ | Michael Movie review: మైఖేల్ మూవీ రివ్యూ: 'కింగ్ ఆఫ్ పాప్' గా జాఫర్ జాక్సన్ విశ్వరూపం.. సినిమా ఎలా ఉందంటే?

ఎమోషనల్ టచ్ తో.. 

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. ఈ సినిమా పాటలు థియేటర్లలో ఫ్యాన్స్‌తో స్టెప్పులేయించాయి. ఇక ప్రభు, తులసి, ముకేష్ రిషి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి సీనియర్ నటుల నటన సినిమాకు ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చింది.