ఆరోగ్య ఉత్పత్తుల్లో అశ్వగంధ ఆకులు, వాటి సారాన్ని వాడటంపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది FSSAI. అశ్వగంధ ఆకుల వాడకం వాళ్ళ లివర్ సమస్యలు, జీర్ణ కోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది FSSAI. హెల్త్ సప్లిమెంట్లు, సంబంధిత ఉత్పత్తుల్లో అశ్వగంధ వేర్లు, వాటి సారాలను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది FSSAI. ఈమేరకు ఆరోగ్య ఉత్పత్తుల్లో అశ్వగంధ ఆకుల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది FSSAI. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
అశ్వగంధ ఉపయోగిస్తున్న కంపెనీలు మొక్కలో ఏ భాగాన్ని వాడుతున్నది ఉత్పత్తులపై పేర్కొనాలంటూ ఆదేశించింది. అశ్వగంధ ఆకుల వాడకంపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో FSSAI కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2026లో అశ్వగంధ మార్కెట్ వాల్యూ సుమారు 8 వేల 595 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మన దేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో సుమారు 10 వేల హెక్టార్లలో అశ్వగంధ పంట సాగు చేస్తున్నారు.
►ALSO READ | Kitchen Telangana: పనసతో పసందైన వంటకాలు.. నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..!
అమెరికా, యూరోప్ దేశాల్లో అశ్వగంధకు డిమాండ్ పెరుగుతోంది. ఆరోగ్య ఉత్పత్తుల్లోనే కాకుండా టీ పొడి, ఎనర్జీ డ్రింక్ గా కూడా అశ్వగంధను వాడుతున్నారు. ఇండియాలో లైంగిక ఆరోగ్యం, బలం కోసం పురుషులు అశ్వగంధ ఎక్కువగా వాడుతున్నారు. టెస్టోస్టిరాన్ పెంచడంలో అశ్వగంధ తోడ్పడుతుంది.

