అన్నింటా అతివలు సమానమే.. ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్‌లో మహిళలకూ చోటు

అన్నింటా అతివలు సమానమే.. ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్‌లో మహిళలకూ చోటు

ఫిమేల్ పెడెస్ట్రెయిన్స్‌ను ఏర్పాటు చేసిన బీఎంసీ
ముంబై: మహిళలు అన్నింటా సమానమే. దేనిలోనైనా పురుషులకు దీటుగా ఈనాటి వనితలు పోటీపడుతున్నారు. ప్రభుత్వాలు కూడా జెండర్ ఈక్వాలిటీ కోసం పలు చర్యలు తీసుకుంటున్నాయి. జర్మనీ లాంటి కొన్ని యూరప్ కంట్రీస్ ట్రాఫిక్ సిగ్నల్స్‌లో మహిళా పాదచారులకు సమ ప్రధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిమేల్ పెడెస్ట్రెయిన్స్ ఫిగర్స్‌ను ఎప్పుడో చేర్చాయి. ఇప్పుడు దీన్ని ఇండియాలోనూ అమలు చేస్తున్నారు. తొలిసారిగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ముంబైలో ఈ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. ముంబైలోని దాదర్‌‌, మహిం ఏరియాల్లోని 13 జంక్షన్స్‌లోని సిగ్నల్స్‌లో ఫిమేల్ పెడెస్ట్రెయిన్స్ ఫిగర్స్‌ను ఏర్పాటు చేశారు. మహారాష్ర మినిస్టర్ ఆదిత్య ఠాక్రే మొదలుపెట్టిన కల్చర్ స్పైన్ అనే ఇనిషియేటివ్‌లో భాగంగా జెండర్ ఈక్వాలిటీని తీసుకురావాలనే ఆలోచనతో ఈ ఐడియాను అమలు చేశారు.

‘మీరు దాదర్ నుంచి వెళ్తుంటే గర్వించే ఓ విషయాన్ని గమనిస్తారు. జెండర్ ఈక్వాలిటీలో భాగంగా ఓ సింపుల్ ఐడియాను బీఎంసీ అమలు చేస్తోంది. ఇప్పుడు సిగ్నల్స్‌లో మహిళలూ ఉన్నారు’ అని ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. దీనికి సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ వస్తోంది. ప్రభుత్వ కొత్త ఐడియాను నెటిజన్స్‌ మెచ్చుకుంటున్నారు. ఇలాంటివి మరిన్ని చేయాలని ట్వీట్ చేస్తున్నారు.