పురానాహవేలీ క్రాస్ రోడ్డు నుంచి కాస్త ముందుకెళ్లగానే ఒక ఇరుకైన సందు. ఆ గల్లీ నాన్ సెంటర్లకు ప్రత్యేకం. వాటి వరండాలో
మైదా పిండి ముద్దలు ఆరబెట్టి కనిపిస్తాయి. ఇంకొంచెం ముందుకెళ్లగానే ‘ఖదీం మున్షీ నాన్ ’ బోర్డు ఈ సెంటర్‌కి 167
ఏళ్ల చరిత్ర ఉంది. డబ్బా ఆకారంలో ఉండే నాన్ ‘చార్ కోణీ’ని నగరానికి పరిచయం చేసిం దేఈ సెంటర్. చార్ కోణీ నాన్స్ మాములు నాన్ ఆకారం కంటే కాస్త భిన్నం గా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా పిజ్జా మాదిరిగా ఉంటాయి. సాహెబ్ సెంటర్ క్రేజ్
నాలుగో నిజాం ‘బహదూర్ అసఫ్ జా’ దగ్గర మహ్మద్ హుస్సేన్ సాహెబ్ మున్షీ(క్లర్క్)గా పని చేసేవాడు . పురానా హవేలీలో హుస్సే న్ కి ‘నాన్ మున్షీ సాహెబ్ ’ పేరిట ఒక నాన్ సెంటర్ ఉండేది. ఒకసారి ఢిల్లీకి వెళ్లినప్పుడు ‘చార్ కోణీ నాన్ ’ ఆయన్ని ఆకర్షించిం ది. అలా ఆ స్పె షల్ నాన్ ని ఆయన నగరానికి పరిచయం చేశాడు.ఆ తర్వాత చుట్టుపక్కల మరికొన్ని సెంటర్లు వెలిశాయి. అయినప్పటికీ సాహెబ్ నాన్ సెంటర్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. కాలక్రమేణా ఆ షాప్ పేరు ‘ఖదీం మున్షీ నాన్ ’ గా మారింది.
క్యూ కడతారు పురానా హవేలీ రోడ్డులో ఈ షాపుని గుర్తించటం చాలా తేలిక. సాయంత్రం అయ్యిందంటే చాలు జనాలు గుం పులుగా కనిపిస ్తుంటారు ఈ సెంటర్ ముందు. ఫ్రెష్ బేక్డ్ నాన్స్‌తో పాటు గ్రిల్డ్ చికెన్ , సీఖ్ కబాబ్ , తందూరీల రుచి కోసం
వాళ్లం తా క్యూ కడతారు. సాహెబ్ కుటుంబం నాలుగు తరాలుగా ఈ సెంటర్ నిర్వహిస్తోంది. సాహెబ్ ముని మనవడు ఖాజా అబ్దుల్ హమీద్ ప్రస్తుతం ఈ సెంటర్ యాజమాని. ఐదుగురు వర్కర్లు . రోజుకి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల మైదా ఉపయోగిం చి నాన్ లు తయారుచేస్తారు . ఒక్క నాన్ పద్నాలుగు రూపాయలు ఉంటుం ది. అవన్నీ అమ్ము డు పోతుయంటున్నాడు ఖాజా.
నవాబుల కాలంలో హైదరాబాదీలకు పరిచయమైన బ్రెడ్ రకం నాన్. మొఘలుల కాలంలో పర్షియా రాజ్యం నుంచి
ఉత్తర భారతదేశానికి..అక్కడి నుంచి మన చెంతకి చేరిం ది. సాయంత్రం అయ్యిం దంటే నగరంలోని పాతబస్తీ, మరికొన్ని ప్రాంతాల్లో నాన్-తందూరీ సెంటర్లలో హడావుడి కనిపిస్తది. అయితే, డబ్బా షేపులో ఉండే ‘చార్ కోణీ నాన్’కి పురానా హవేలీ
కేరాఫ్ అడ్రస్. అందులో‘ఖదీం మున్షీ సెంటర్’చరిత్ర ఇంకా ప్రత్యేకం.మున్షీ నాన్ ‘రెగ్యులర్ కస్టమర్లతో పాటు ఫంక్షన్ లకు,వేడుకలకు చార్ కోణీ నాన్ లు సప్లై చేస్తo.మాములు నాన్ ల కంటే వీటిని జనాలు ఎందుకు ప్రత్యే కంగా చూస్తారో నేను చెప్పలేను. కానీ, పిజ్జా తరహాలో ఉండి ముక్కలుగా చీల్చడానికి ఇది వీలుగా ఉంటుం ది. బహుశా అందుకేనేమో వీటికిం త క్రేజ్ ’ అంటున్నాడు ఖాజా. మటన్, పాయా, చికెన్ కుర్మా కాం బినేషన్ లో ఈ నాన్ టేస్ట్ అదిరిపోతుందంటున్నాడు. నగరంలో ఎన్ని నాన్-త ందూరీ సెంటర్లు వెలిసినా..ఖదీం సెంటర్ కి ప్రత్యే క గుర్తింపు ఉంది.
