
ఈ సూపర్ ఫాస్ట్ కాలంలో డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇంకా క్లియర్‌గా చెప్పుకోవాలంటే… బీపీ, షుగర్లు ఉండటం ఇప్పుడు చాలా మామూలు విషయం అయిపోయింది. అంతలా ఇవి మన ఆరోగ్యాల మీదకి ఎటాక్ చేస్తున్నాయి. మనం కూడా రెడీ అయి వాటిని కంట్రోల్ చెయ్యకపోతే చాలానే ఇబ్బందులు పడాలి. డయాబెటిస్‌ని కంట్రోల్ చేసే ముఖ్యమైన వాటిలో పుట్టగొడుగులు కూడా ఒకటి. డయాబెటిస్‌ను నియంత్రించడానికి పుట్టగొడుగులు బాగా పనిచేస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర చాలా తక్కువస్థాయిలో ఉంటాయి. అంతే కాకుండా యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి కాలేయంలో స్రవించే గ్లూకోజ్‌ని నియంత్రించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. గౌట్లోని సూక్ష్మజీవుల చర్యను మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు… శరీరంలోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడానికి మెట్ఫార్మిన్ని తీసుకుంటారు. కానీ దీనికి బదులుగా పుట్టగొడుగులను ఉపయోగించొచ్చు. ఇవి దాదాపు అదే స్థాయిలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. పైగా సహజమైన ఆహారపదార్ధం అవ్వడంతో, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం కూడా లేదు. పుట్టగొడుగుల ద్వారా అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. పైగా తక్కువ కేలరీలు ఉండటం మనకి కలిసొచ్చే మరో అంశం. ఇవి గుండె పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగపడతాయి.