కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు 21 కొత్త కోర్టులు మంజూరు

కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు 21 కొత్త కోర్టులు మంజూరు

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్తగా 21 అడిషనల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 6, హుజురాబాద్ లో 1, జగిత్యాల జిల్లా కేంద్రంలో 3, మెట్ పల్లి, కోరుట్ల, ధర్మపురికి ఒక్కొక్కటి చొప్పున మంజూరయ్యాయి. 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 3, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 1, గోదావరిఖనిలో 2, సుల్తానాబాద్, మంథనికి ఒక్కొక్కటి మంజూరయ్యాయి. కాగా వాటిని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారనే నిర్ణయం హైకోర్టు తీసుకోనున్నట్లు సమాచారం.