హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసులో గందరగోళం నెలకొంది. భగీరథ్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించగా.. తన కుమారుడే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యాడని బండి సంజయ్ తెలిపారు. దీంతో భగీరథ్ అరెస్ట్ అయ్యాడా..? లేక లొంగిపోయాడా..? అనే దానిపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో భగీరథ్ వ్యవహారంపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు అరెస్ట్ కాలేదని.. న్యాయవాదుల సమక్షంలో స్వయంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చారు.
కాగా, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై బండి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పేట్ బషీర్బాద్ పోలీసులు భగీరథ్‌కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించగా ఇందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో శనివారం (మే 16) రాత్రి భగీరథ్ పేట్ బషీర్బాద్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు.
