- నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 30 టీచర్లు, లెక్చరర్ల సంఘాలతో ఏర్పడిన తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీ టీజేఏసీ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో పీఆర్‌టీయూటీజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
జేఏసీ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖర్ రావు, సెక్రటరీ జనరల్‌గా నర్సింహులు, గౌరవ అధ్యక్షుడిగా హర్షవర్ధన్ రెడ్డి, ట్రెజరర్‌గా మురళీధర్ గౌడ్, కో చైర్మన్లుగా భూతం యాకమల్లు, మమహ్మద్ అబ్దుల్లా, ఎం.వెంకన్న, ఎండీ.సాబేర్, చక్రవర్తుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా ఎండీ.అమీర్ పాషా ఎన్నికయ్యారు. అనంతరం తెలంగాణ రెండో పీఆర్సీని మంచి ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని, ప్రతి నెలా టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని తీర్మానించారు.
