భూమి కొనకపోతే కిడ్నాప్ చేస్తం: నయీం గ్యాంగ్ సభ్యుడి బెదిరింపులు

భూమి కొనకపోతే కిడ్నాప్ చేస్తం: నయీం గ్యాంగ్ సభ్యుడి బెదిరింపులు

ఘట్​కేసర్, వెలుగు: దస్తావేజులు లేని భూమిని కొనకపోతే కిడ్నాప్ చేస్తామని నయీం గ్యాంగ్ సభ్యుడు బెదిరిస్తున్నాడ ని ఘట్​కేసర్ మండల రైతు సహకార సం ఘం డైరెక్టర్ జడిగె రమేశ్ ఆరోపించారు. గురువారం ఆయన కొర్రెముల్​లోని జేకే కన్వెన్షన్​లో మీడియాతో మాట్లాడారు. తన ఫంక్షన్ హాల్​కు ఆనుకుని ఉన్న అనధికార భూమిని కొనుగోలు చేయాలని కొర్రెముల్ కు చెందిన మెట్టు అంజయ్య గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అతనికి సంబంధించి కోర్టులో ఓడిపోయిన భూమిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వాలని నయీం గ్యాంగ్ సభ్యుడు యాదగిరిగుట్టకు చెందిన బీరగోని సత్తయ్య బెదిరింపులకు పాల్ప డుతున్నట్లు చెప్పారు.

వారం రోజులుగా మూడు కార్లలో వెంబడిస్తున్నారని, ఫంక్షన్ హాలులోకి వచ్చి కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. దస్తావేజులు లేకుండా భూమి కొనుగోలు చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న మెట్టు అంజయ్య, బీరగోని సత్తయ్యలపై ఘట్​కేసర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రమేశ్ పేర్కొన్నారు.