ఒక మొక్కను కాపాడలేనివాడు రైతు బిడ్డ ఎలా అవుతాడు: హోస్ట్ నాగార్జున

ఒక మొక్కను కాపాడలేనివాడు రైతు బిడ్డ ఎలా అవుతాడు: హోస్ట్ నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో సెకండ్ ఎలిమినేషన్ సమయం వచ్చేసింది. ఇంకో కొన్ని గంటల్లో బిగ్ బాస్ హౌస్ నుండి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం డేంజర్ జోన్ శోభా శెట్టి(Shobha shetty), షకీలా(Shakila), టేస్టీ తేజ(Tasty teja) ముగ్గురు ఉన్నారు. మరి ఇందులో ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి. 

ఇక తాజాగా శనివారం నాటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను రిలీజ్ చేశారు. నిజానికి ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రోమో కూడా చాల ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రోమోలో నాగార్జున  కంటెస్టెంట్స్ ను కడిగిపారేశాడు. వరుసగా అమర్ దీప్, షకీలా, ప్రియాంక,శివాజీ లను ఏకిపారేశాడు. బిగ్ బాస్ మీటర్ పై వాళ్ళ పెర్ఫార్మెన్స్ ను సూచిస్తూ కౌంటర్లు వేశాడు. 

ఇక పల్లవి ప్రశాంత్ పై కూడా సీరియస్ అయ్యాడు నాగార్జున. బిగ్ బాస్ మీటర్ లో నీ ఆట ఎక్కడ ఉందని నువ్ అనుకునుటున్నావ్ అని ప్రశాంత్ ను అడగగా.. గ్రీన్ కు దగ్గరగా అంటూ సమాధానం ఇచ్చాడు ప్రశాంత్. కానీ నాగార్జున మాత్రం రెడ్ లో పెట్టేశాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు ప్రశాంత్ కు నాగార్జున ఒక మొక్కను ఇచ్చారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే అను కూడా చెప్పాడు. కానీ ఆ చెట్టు ఇప్పుడు పూర్తిగా వాడిపోయింది. తాజా ప్రోమోలో ఆ చెట్టును స్టేజి పైకి తెప్పించి.. మాట్లాడితే రైతు బిడ్డ, రైతు బిడ్డ అంటావ్.. నీకిచ్చిన ఒక మొక్కను కూడా కాపాడుకోలేకపోయావు. ఒక మొక్కను కాపాడుకోలేనివాడు రైతు బిడ్డ ఎలా అవుతాడు అంటూ సీరియస్ అయ్యాడు. నాగార్జున మాటలకు ప్రశాంత్ తల దించుకున్నాడు. దీంతో ఈ వారం ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది.