
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో సెకండ్ ఎలిమినేషన్ సమయం వచ్చేసింది. ఇంకో కొన్ని గంటల్లో బిగ్ బాస్ హౌస్ నుండి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నాడు. అయితే ఇక్కడే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇవ్వనున్నాడు. ఒకరిని అలా బయటకు పంపించేసి.. వైల్డ్ కార్డు ద్వారా మరో ఇద్దరినీ ఇంట్లోకి పంపించనున్నాడు.
మరి ఈ ఇద్దరు ఎవరు అనేది ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఆ ఇద్దరిలో ఒకరు సింగర్ భోలే శవాళీ కాగా మరొకరు సీరియల్ ఆర్టిస్ట్ పూజామూర్తి. ఈ ఇద్దరినీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడానికి సిద్దమయ్యారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సెకండ్ వీక్ ఎలిమినేషన్ కు దగ్గరలో ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శోభా శెట్టి, టేస్టీ తేజ, షకీలా ఉన్నారు. వోటింగ్ పరంగా చూసుకుంటే ఈ ముగ్గురే లీస్ట్ లో ఉన్నారు. అయితే.. శోభా శెట్టికి సీరియల్స్ ఆర్టిస్టుగా మంచి ఫేమ్ ఉంది అంతేకాదు ఆమెకు రెమ్యునరేషన్ కూడా బాగానే ముట్టచెప్తున్నారు కాబట్టి శోభను మరికొన్ని వారాలు పాటు ఇంట్లో ఉంచే అవకాశం ఉంది. ఇక టేస్టీ తేజ వల్ల హౌస్ లో కాస్త ఫన్ జనరేట్ అవుతోంది కాబట్టి మనోడికి కూడా ఇప్పుడప్పుడే హౌస్ నుండి బయటకు వచ్చే అవకాశం లేదు. ఇక మిగిలింది షకీలా మాత్రమే. ఆమె హౌస్ లో పెద్దగా పార్టిసిపేట్ చేయడం లేదు. కొంతమందితో తప్ప ఏక్కువగా ఎవరితో కలవడం లేదు. అందుకే ఆసియన్స్ కూడా ఆమెకు పెద్దగా కనెక్ట్ అవడంలేదు. దీంతో ఈ వారం షకీలా ఎలిమినేటి అయ్యే అవాకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.