భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్.. రూ.10 వేలు ఆర్థిక సహయం ప్రకటించిన ప్రభుత్వం

భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్.. రూ.10 వేలు ఆర్థిక సహయం ప్రకటించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: భవన నిర్మాణ కార్మికుల ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఆర్థిక సహయం అందజేయనున్నట్లు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో వాయు కాలుష్య నివారణకు రేఖా గుప్తా ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశ రాజధానిలో భవన నిర్మాణ కార్యకలాపాలపై ప్రభుత్వం తాత్కలిక నిషేధం విధించింది. 

ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాణ కార్మికులు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిసైడైన ప్రభుత్వం.. రూ.10 వేల ఆర్థిక సహయాన్ని ప్రకటించింది. అర్హులైన నిర్మాణ కార్మికులకు ప్రత్యక్ష నగదు బదిలీ పద్దతిలో డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. 

ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నిర్మాణ కార్మికులు ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలో ఐదో క్లాస్ వరకు సెలవులు ప్రకటించారు. ఈ పిల్లలకు ఆన్​లైన్ క్లాసులు మాత్రమే ఉంటాయి. అలాగే భారీ వాహనాలను నిషేధించారు. సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, ఆఫీసులు 50% మందితోనే నడపాలని కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.