చలి ముదురింది. పదైనా బయటకు రావాలంటే జంకుతున్నారు. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గుతున్నాయి. శీతాకాలం వచ్చిందంటే... జలుబు, దగ్గు లాంటి రోగాలు బాగా ఇబ్బంది పెడతాయి.. జలుబే కదా అని చాలామంది పట్టించుకోరు. వింటర్సీజన్ లో కొన్ని జాగ్రత్తలుపాటిస్తే మాయదారి జలుబు.. దగ్గుకు దూరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. . !
కానీ జలుబు పది రోగాల పెట్టు. సర్ది చేస్తే ఒళ్లంతా నొప్పులు... ఏ పనీ చేయబుద్ధికాదు. చికాకు, విసుగు కలుగుతుంది. మిగతా కాలాల్లో అయితే జలుబు తొందరగా తగ్గుతుంది కానీ, చలికాలంలో అలాకాదు. ఒకవైపు పొగమంచు, చలి తీవ్రత, మరోవైపు శరీరంలో వేడిశాతం తక్కువగా ఉండటం. వీటితోపాటు దుమ్ము, ధూళి... కాబట్టి జలుబు తగ్గడం అంతా ఈజీ కాదు.
జలుబు రాకుండా ఉండాలంటే శరీరంలో రోగని రోధక శక్తి ఎక్కువ ఉండాలి. జబబు వచ్చినప్పు డు సుమారు రెండువందల వైరస్ లు శరీరంపై దాడి చేస్తాయి. అందుకే జలుబుతోపాటు గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, శ్వాస సమస్య, ఆయాసం, దగ్గులాంటివి వస్తాయి. అంటువ్యాది ఇంట్లో ఒకరికి వచ్చిందంటే, పక్కవాళ్ల కు వ్యాపిస్తుంది. ప్రయాణాల్లో పక్కనున్న వాళ్లకూ వచ్చేస్తుంది. సాధారణంగా శరీరంలో ఇమ్యునిటీ శాతం పెరగగానే జలుబు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొందరిలో అలా జరగదు.
లక్షణాలు: జలుబును పడిశం, రొంప, సర్ది అంటారు. శ్వాసనాళంపై వైరస్లు చూపే ప్రభావం వల్ల జలుబు చేస్తుంది. వ్యాధి సోకిన రెండు రోజుల్లోనే దాని లక్షణాలు బయపడతాయి. జలుబు వచ్చిందంటే ముక్కునుంచి నీరు కారుతుంది. ఆకలి తగ్గుతుంది. తలనొప్పి వస్తుంది. పిల్లలు బడికి వెళ్లినప్పుడు తోటి పిల్లల నుంచి సులభంగా ఈ వ్యాధి సోకుతుంది. సరిగా నిద్ర పోకపోయినా, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా జలుబు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చలికాలం కనుక జలుబుతో పాటు దాని తీవ్రతను బట్టి వణుకు కూడా రావచ్చు, తుమ్ములు, దగ్గు వస్తాయి కానీ జలుబు, దగ్గు ఓ పట్టాన తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే న్యూమోనియా లేదా ట్యూబర్ క్యూలోసిస్ (టి.బి)లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీయొచ్చు. కాబట్టి తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
ప్రమాదమా..?: జలుబు అసలు రోగమే కాదు మందులు వాడితే వారం రోజుల్లో తగ్గుతుంది ..వాడకపోయినా ఏడు రోజుల్లో తగ్గుతుందని సరదాకి జోక్ వేస్తుంటారు. కానీ జలుబు వల్ల కలిగి బాధ అంతా ఇంతా కాదు. జలుబు కలిగించే సాధారణ వైరస్ ను .. కొరోనా... అంటారు. అయితే జలుబు ఒక్కోసారి ప్రమాదకారిగా మారే అవకాశం లేకపోలేదు. ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. చలి కాలంలో ఆస్తమా ఉన్నవాళ్లు ఆరోగ్యం ఎక్కువ దెబ్బ తింటుంది. ఆయాసం పెరిగి ప్రాణం మీదకు దావచ్చు. కఫం చేరడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది.
అసలు మిగిలిన వ్యాధులకు కారణం కావచ్చు. లేదా ముదిరి ప్రమాదకారిగా మారొచ్చు. చలికాలంలో జలుబు వల్ల చిన్నపిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. వాళ్ల శరీరాన్ని వెచ్చగా ఉంచాలి. గొంతు తడి అరకుండా చూడాలి.. పాష్టిక ఆహారాన్ని పెట్టడం ఎక్కువసేపు నిద్ర పోయేటట్లు చూసుకోవడం వల్ల పిల్లలో జలుబు ప్రమాదకారిగా మారదు.
జలుబు వైరల్, బ్యాక్టీరియా వల్ల రావచ్చు. తెమడ వస్తుంటే బ్యాక్టీరియా వల్లేనని తెలుస్తుంది. వైరస్ వల్ల అయితే యాంటీబయోటిక్స్ అవసరం లేదు. బ్యాక్టీరియా వల్ల అయితే మాత్రం యాంటీ బయోటిక్స్ వాడాలి. చలికాలంలో ఆస్తమా ఉన్న వాళ్లు, పెద్దవయసున్నవాళ్లు ఉదయం, పిల్లలు ఆరు గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే, వాళ్లలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. పిల్లలను ఐస్క్రీమ్స్, చాక్లెట్స్, స్వీట్స్ కు దూరంగా ఉండాలి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే స్వెటర్ వేసుకోవాలి. చర్మం పొడిబారిపోకుండా లోషన్స్ వాడాలి. ఇన్ హేలర్ వాడేవాళ్లు ఎక్కువసార్లు వాడాల్సి రావచ్చు. చలి బారిన పడకుండా వాకింగ్ టైమింగ్ సెట్ చేసుకుంటే మంచిది. లేదా ఇండోర్లో చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు : జలుబు పూర్తిగా తగ్గడానికి మందులేవు శుభ్రత పాటించడం ఒక్కటే మార్గం.
- ఇంట్లో ఇంటి పరిసరాల్లో దుమ్ము , బూజు, చెత్త... లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
- తడి ఉంటే సూక్ష్మజీవులు ఎక్కువ చేరతాయి కాబట్టి పొడిగా ఉంచుకోవాలి. అలాగే చేతులు కడుక్కోవాలి. మురికిగా ఉన్న వస్తువులను వాడకూడదు.
- స్వీట్స్ లాంటి ఆహారపదార్ధాలకు చలికాలంలో దూరంగా ఉండటం మంచిది.
- జలుబు ఉన్నా లేకున్నా చలికాలంలో రోగ నిరోధక శక్తి తక్కువ గా ఉన్న వాళ్లు ముక్కుకు మాస్క్ పెట్టుకోవాలి.
- జలుబుకు యాంటిబయోటిక్స్ మందులువాడటం అంతమంచిది కాదని వైద్యులు చెప్తారు. జింకుతో కూడిన సప్లిమెంట్లు జలుబును ఆపలేవు కానీ, కొంతవరకు తీవ్రత తగ్గిస్తాయి ఎన్ని జాగ్రత్తలు పాటించినా జలుబును అడ్డుకోవడం కష్టమే.
- జలుబు ఉన్న వ్యక్తి తుమ్మినా లేదా దగ్గినా వాళ్ల నోటీనుంచి వచ్చే తుంపర్ల వల్ల కూడా జలుబు వ్యాపిస్తుంది. కాబట్టి జలుబు ఉన్నవాళ్లకు దూరంగా ఉండాలి.
ఇంటి చిట్కాలు
- గ్రీన్ టీలో జలుబును తగ్గించే క్యాటెచీన్స్ ఎక్కువ గా ఉంటాయి. కాబట్టి గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
- వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఎక్కువ. అందువల్ల జలుబు చేసినప్పుడు వెల్లుల్లిని తీసుకుంటే మంచిది.
- బ్లూబెర్రీ స్ లో విటమిన్–- సి ఎక్కువగా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి ఎక్కువే. వీటిని తినడం వల్ల జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
- చాలామంది జలుబు చేసినప్పుడు చికెన్ సూప్ తీసుకుంటారు.దానిలో ఉండే సిస్టిన్ అనే అమైనోయాసిడ్ లో రోగ నిరోధకశక్తి జలుబు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
- అల్లంలో ఉంటే సెక్సిటర్బెన్స్ జలుబుకు కారణమైన వైరస్ తో పోరాడుతుంది. అందువల్ల అల్లంతో కాచిన నీటిని జలుబు చేసినప్పుడు రోజుకు మూడు నాలుగు సార్లు తీసుకుంటే జలుబు తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
- వేడి నీళ్ల ఆవిరి పట్టడం కూడా ఉపయోగమే.
- పసుపు కొమ్మును నీళ్లలో వేసి, వేడిచేసి తాగినా కొంత మంచిది.
- వేడి నీళ్లు ఉప్పు కలిపి అప్పుడప్పుడు పుక్కిలించడం వల్ల జలుబుకు సంబంధించిన వైరస్లు నశిస్తాయి.
