తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది క్యాండిడేట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
- వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ లో ఉన్న ఏజంట్ లు గుర్తులు చెబుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు. దాడిలో సర్పంచ్ అభ్యర్థి రాములుకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- వనపర్తి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 23.30శాతం పోలింగ్ నమోదు
- నారాయణపేట జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 12.73 శాతం పోలింగ్ నమోదు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదు
- ఖమ్మం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 37 శాతం పోలింగ్ నమోదు
- మహబూబ్ నగర్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 25.38 శాతం పోలింగ్ నమోదు
- జోగులాంబ గద్వాల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 28.32 శాతం పోలింగ్ నమోదు
- ఆలంపూర్ :29.00 శాతం
- ఉండవెళ్లి : 28.81 శాతం
- మాన పాడు: 23.73 శాతం
- ఇటిక్యాల : 26.81 శాతం
- ఎర్రవళ్లి : 33.16 శాతం
- మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత. రెండు వర్గాల మధ్య వాగ్వాదం. పోలింగ్ బూతుల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు. భారీగా పోలీసుల మోహరింపు. రెండు వర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు.
-
నాగర్ కర్నూలు జిల్లాలో ఉదయం 9 గంటల సమయానికి 25.70 శాతం పోలింగ్ నమోదు
- అచ్చంపేట... 27.45 శాతం
- అమ్రాబాద్...25.26 శాతం
- బల్మూర్... 22.04 శాతం
- లింగాల.. 27.16 శాతం
- ఉప్పునుంతల ...25.80 శాతం
- పదార....25.29 శాతం
- చారకోండ ....27.73 శాతం
- కరీంనగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 9 గంటల వరకు మండలాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.
- హుజురాబాద్ 20.37 శాతం పోలింగ్ నమోదు.
- జమ్మికుంట 15.62 శాతం పోలింగ్ నమోదు
- వీణవంక 20.06 శాతం పోలింగ్ నమోదు
- సైదాపూర్ 24.28 శాతం పోలింగ్ నమోదు
- ఇల్లందకుంటలో 22.58 శాతం పోలింగ్ నమోదు
- ఆదిలాబాద్ జిల్లాలో తోమ్మిది గంటల వరకు19.37% నమోదు
- నిర్మల్ జిల్లాలో 9 గంటల వరకు 29.98% నమోదు
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 18.60 శాతం పోలింగ్ నమోదు
- సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 24.35 శాతం పోలింగ్ నమోదు
- మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 24.89 శాతం పోలింగ్ నమోదు
- సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 26.75శాతం పోలింగ్ నమోదు
- ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 29 % దాటిన పోలింగ్
- మంచిర్యాల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం 27.15%
- రంగారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.58 శాతం పోలింగ్
- మంచిర్యాల జిల్లామందమర్రి మండలంలో 9 గంటల వరకు 34 శాతం పోలింగ్
-
పెద్దపల్లి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 22.50 శాతం
- ఎలిగేడు 22.56%
- ఓదెల 19.50 %
- పెద్దపల్లి 21.08 %
- సుల్తానాబాద్ 26.08%
-
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- కాటారం,మహదేవపూర్,మహముత్తారం, మల్హర్ రావు మండలాల్లో 9 గంటల వరకు
- 26.11 శాతం పోలింగ్ నమోదు.
-
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పోలింగ్ శాతం వివరాలు
- ధర్మపురి-20.33%
- వెల్గటూర్-26%
- ఎండపల్లి-22.1%
- గొల్లపల్లి-26.44%
- బుగ్గారం-20.26%
- పెగడపల్లి-19.19%
-
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 9 గంటల వరకు పోలింగ్ శాతం
- వరంగల్ జిల్లా : 22.26
- జనగామ జిల్లా 22.51%
- హనుమకొండ జిల్లా :21.22
- ములుగు జిల్లా: 20.96
- మహబూబాబాద్ జిల్లా: 24.32
- భూపాలపల్లి జిల్లా: 22.01
- కరీంనగర్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.66% పోలింగ్ నమోదు
- వరంగల్ నర్సంపేట మండలం లక్నపల్లిలో వినూత్నంగా పోలింగ్ కేంద్రం..
- ఓటర్లను ఆకట్టుకునేలా హరిత పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దిన అధికారులు
- ఆహ్లాదకరమైన, వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు..
- కొబ్బరి మట్టలు... అరిటాకు ల తో పందిరి.. మామిడి తోరణాలతో స్వాగతం
- ఎకో ఫ్రెండ్లీ గా నిలిచిన లక్నవరం పోలింగ్ కేంద్రం
- కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బోమ్మెళ్ల రాజయ్య ఓటమి బయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రికి తరలింపు
- మహబూబ్‌నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం గ్రామపంచాయతీలు 563, ఏకగ్రీవం 52, ఎన్నికలు జరగని ప్రాంతాలు 7, మిగతా 504 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు ఓటర్లు.
- మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉత్సాహంగా క్యూ కట్టారు. అభ్యర్థులు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది..
- నిర్మల్ జిల్లా ముథోల్ సెగ్మెంట్ లోని భైంసా, కుభీర్, తానూరు, బాసర, ముథోల్ మండలాల్లో 124 జీపీల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచే గ్రామీణ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. క్యూ పద్ధతిలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
- ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో మూడవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి..7 గంటల నుండే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఓటర్లు.. అదిలాబాద్ జిల్లాలో బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరేడిగోండ, గుడిహత్నూర్, తలమడుగు మొత్తం 6 మండలాలలో ఏకగ్రీవం మినహా 120 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి
- పెద్దపల్లి జిల్లాలో తుది విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 243 గ్రామపంచాయతీలు, 2432వార్డులు ఉన్నాయి..
- కరీంనగర్ జమ్మికుంట మండలం కోరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుంటన్న స్థానికులు
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మూడు మండలాలకు మూడో విడత ఎన్నికలు 65 గ్రామపంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయాన్నే పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్లకు ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్స్ ను చూపెడుతూ సీల్ వెశారు.
-
3,547 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్..
- మూడో విడత పోలింగ్ కోసం 36,483 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,547 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. 4,502 మంది ఆర్వోలు, 77,618 మంది పోలింగ్‌సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు, 43,856 బ్యాలెట్ బాక్స్‌లను అందుబాటులో ఉంచారు. పోలింగ్‌కు 3 రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటా తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
