వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర జంటగా సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. బాలకృష్ణ మహరాణా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ ‘డైరెక్టర్ చెప్పిన సబ్జెక్టు నాకు బాగా నచ్చింది. ఇందులో యాక్షన్‌తో పాటు ఫుల్లుగా కామెడీ కూడా చేశాను. ప్రతి ఒక్కరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘ప్రేమ, పగ, తప్పొప్పులు, మంచిచెడుల మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించాం. హారర్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రంలో కృష్ణసాయి, బేబీ తనస్వి భిన్న పాత్రల్లో మెప్పిస్తారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పాడు. ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.
