జూన్ నెలలో నల్గొండ ఫ్లైఓవర్ పూర్తి చేయాలి.. నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

జూన్ నెలలో నల్గొండ ఫ్లైఓవర్ పూర్తి చేయాలి..  నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

హైదరాబాద్ సిటీ, వెలుగు: నల్గొండ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, మూసారాంబాగ్ డౌన్‌‌‌‌ స్ట్రీమ్ బ్రిడ్జి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నల్గొండ ఫ్లైఓవర్ మొత్తం 85 స్పాన్లతో నిర్మిస్తున్నారు.  ఇప్పటివరకు 79 స్పాన్లలో డెక్ స్లాబ్ పనులు పూర్తయ్యాయి. 

అప్ ర్యాంప్, డౌన్ ర్యాంప్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.  మరోవైపు, మూసారాంబాగ్  బ్రిడ్జి పనులు కూడా  కొనసాగుతున్నాయని, అంబర్‌‌‌‌పేట్ వైపు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయన్నారు. సీఈ రత్నాకర్ ఉన్నారు.