A,B ఫారాలతో మేయర్‌, ఛైర్‌పర్సన్ల పేర్లు: నాగిరెడ్డి

A,B ఫారాలతో మేయర్‌, ఛైర్‌పర్సన్ల పేర్లు: నాగిరెడ్డి

రాజకీయ పార్టీలు మేయర్‌, ఛైర్‌పర్సన్ల పేర్లను A,B ఫారాల ద్వారా ఇవ్వాలన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (SEC) నాగిరెడ్డి. ఈనెల 26న ఉదయం 11 గంటల్లోపు A ఫారం, 27న ఉదయం 10 గంటల్లోపు B ఫారం ఇవ్వాలన్నారు. మేయర్‌, ఛైర్‌పర్సన్‌ ఎన్నిక క్రమంలో రాజకీయ పార్టీలు తమ విప్‌లను నియమించుకోవచ్చని.. అయితే విప్‌ ఎవరనేది 26న ఉదయం 11 గంటల్లోపు తెలపాలన్నారు. పరోక్ష ఎన్నిక క్రమంలో ప్రత్యేక ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని.. రేపు(శనివారం) సాయంత్రం నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. సాధారణ ఎన్నికల్లో ఉండే ఎలక్షన్ కోడ్ మాదిరిగానే ఇది ఇది కూడా ఉంటుందని తెలిపారు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి.